సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో .. చిన్న చిన్న కారణాలతో ఇంట్లో పెద్దలపై అలిగి ఇద్దరు అమ్మాయిలు తమ బంగారు భవిషత్తు ను మరచిపోయి ఆత్మహత్యలకు పాల్బడిన ఘటనలు .. జీవితాన్ని ప్రేమించలేని.. అనుభవం లేని యువత ఆలోచనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పు కోలేదని పాలకొల్లులో భారతి (21)అనే యువతి ఆత్మ హత్య కు పాల్పడినట్లు పట్టణ ఎస్సై ఎస్.ముత్యాలరావు తెలిపారు. టిడ్కో గృహ సముదాయం లో భారతి తల్లితో కలిసి నివాసం ఉంటుంది. తండ్రిని చిన్నతనంలో కోల్పోయిన ఆమె చక్కగా చదువుకొని స్థానికం గా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసుకొంటూ కొంత కాలంగా ఒక యువకుడిని ప్రేమించి తల్లి ఒప్పుకోకపోవడంతో క్షణికావేశంలో ఇంట్లోనే ఉరి వేసుకొని జీవితాన్ని చాలించింది. తణుకు పట్టణంలో పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెం దిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మొన్న మంగళవారం రాత్రి తల్లి బాలికను ఇంటి పనులు చేయకపోవడం తో మందలించారు. ఈ నేపథ్యంలో ఆమె తల్లితోపాటు తమ్ముడిని గదిలో ఉంచి, గడియవేసి, స్థానిక జూబ్లీ పార్కు రోడ్డులో ఉన్న వంతెనపై నుంచి గోస్తనీ కాలువలోకి దూకింది. పోలీసులు,అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా.. నిన్న బుధవారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. చిన్న కారణానికి ఆ కుటుంబానికి క్షోభ మిగిల్చింది.అన్ని విద్యాసంస్థలలో విద్యార్థులకు చిన్నతనం నుండి కౌన్సిలింగ్ క్లాస్ లు నిర్వహించవలసిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *