సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో గతంలో ఎప్పుడు లేనివిధంగా వాతావరణం లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నా యి. రుతుపవనాలు ఆలస్యం కావడం .. వర్షాలు ఆలస్యం కావడం .. ప్రచండ ఎండలు.. మళ్లీ కుండపోత వానలు.. ఇలా వాతావరణం ఒక పద్దతిలో లేదు.. భీమవరం లో అయితే మొన్న రోజంతా కుంభవృష్టి.. నిన్న చల్లదనం… నేడు, శుక్రవారం జనం తోలు ఊడేలా మధ్యాహ్నం వరకు కాస్తున్న భీకర ఎండలు.. అయితే ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లోఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి.శుక్ర, శని ఆదివారాల్లో కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *