సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలను నేడు శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌ ఆయన సతీమణి భారతి, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్‌ అభినందించడం జరిగింది. . ఆపై పరేడ్‌లో వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్, సీఎం జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *