సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి “Music For Meditation” కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాదకుమార్ తో కలిసి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ కార్యక్రమంలో రఘురామా, మాట్లాడుతూ.. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రవచనాలతో పాటు అపూర్వమైన సంగీత ప్రజ్ఞ తో ఆయన మధుర గానంతో ఎన్నో అద్భుతాలు, మానవుడు మానసిక ప్రశాంతత కు ప్రయోగాలు చేస్తున్నారని, .అయన సంగీత ప్రజ్ఞ కు గానానికి మనుషులే కాదు పశు పక్షాదులు కూడా తన్మయం చెందుతాయి అని అటువంటి మహానుభావుని కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాల సంతోషంగా ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *