సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ప్రభుత్వ అనుమతులు లేని నాటు తుపాకులు వినియోగిస్తున్న నలుగురిపై గణపవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధిత వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు గణపవరం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు.. చినరామచంద్రపురంలో సీఐ సుభాష్, ఎస్సై వెంకటేశ్వ రరావు సిబ్బందితో కలిసి గత శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించిన నేపథ్యంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నెల్లూరుకు చెందిన నక్కల శివకుమార్, మీనంపాతం రవి, తమిళనాడుకు చెందిన అజయ్, నక్కల మురళి పోలీసులను చూసి అకస్మాత్తుగా తప్పించుకొంటూ పారిపోయారు. సిబ్బం ది వారిని వెంబడించి పట్టుకొని వారివద్ద అనుమతులు లేని నాటు తుపాకీలున్నట్లు గుర్తించారు. అయితే వారు చేపలు, రొయ్య ల చెరువులపై వాలే పక్షులను కొట్టేందుకు వాటిని వాడుతున్నట్లు చెప్పడం తో కేసు కాస్త లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత చెరువు యజమానిపై ఆయుధాల చట్టం పై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ ప్రకటించారు.
