సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో త్వరలో జరగబోయే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కూడా పశ్చిమగోదావరి జిల్లా లో ఎటువంటి మార్పులు చెయ్యకుండా భీమవరం డివిజన్ పరిధిలో ఉన్న గణపవరం మండలాన్ని యథాతధంగా ఉంచాలని గణపవరం మండలంలోని 25 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీసుకున్న ఏకగ్రీవ తీర్మాన ప్రతులతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కు నేడు, ఆదివారం అందజేశారు. గణపవరం మండల రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ కూడా భీమవరం డివిజన్ పరిధిలోనే కొనసాగాలని గణపవరం మండలానికి చెందిన పలువులు ఎంపీటీసీలు, సర్పంచులు వివిధ పార్టీల నాయకులు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ను కోరారు. వారి డిమాండ్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీనివాస వర్మ వారికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, నాగరాణికి వెంటనే ఫోన్‌లో తెలిపారు . అదేవిధంగా రెండు రోజుల్లో లిఖితపూర్వక లేఖను కూడా పంపిస్తాను అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *