సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 7 న జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసుకొనే గణేష్ పందిళ్ళు, మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా ముందస్తు సంబంధిత శాఖల నుండి అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., ఆదేశాలు జారీ చేసారు. .వినాయక ఉత్సవాలను శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా నిర్వహించు కోవడానికి పోలీసుశాఖ కు ప్రజలందరూ సహకరించాలన్నారు.ఉత్సవాల నిర్వహణలో ప్రతీ ఒక్కరూ మత సామరస్యాన్ని పాటించాలని, ఇతర మతాల వారికి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా కమిటీ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు, రికార్డింగు డాన్సులు నిర్వహించ రాదన్నారు. ఉత్సవాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించి నట్లయితే సంబంధిత పంచాయతీ లేదా మున్సిపల్ అధికారుల నుండి అనుమతులు పొందాలని, అదే విధంగా ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తే సంబంధిత స్థల యజమానుల నుండి ముందుగా అనుమతులు పొందాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఉత్సవాల్లో వినియోగించే మైకులు, సౌండు బాక్సు లతో ప్రజలకు ఇబ్బందులు గురి చేయకూడదని, అనుమతులు పొందాలన్నారు. ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంలో కమిటీ సభ్యులు 24/7 లో అందుబాటులో ఉండాలని, సీసీటీవీ కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం నిర్వహించే సమయంలో ప్రమాదకరమైన రంగులు జల్లు కోవడం, ఎటువంటి బాణాసంచా ను వినియోగించకుండా చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు. ఉత్సవాలు పేరుతొ నిర్వాహకులు బలవంతంగా వసూళ్ళు కు పాల్పడితే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *