సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంలో ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా తరలివస్తున్న భక్తులు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.. అలాగే వారు శ్రీవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు కూడా అదేస్థాయిలో ఉంటునాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో స్వామివారిని గత ఫిబ్రవరి మాసంలో 18.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టిటిడి పేర్కొంది. అలాగే ఫిబ్రవరి మొత్తంగా శ్రీవారికి హుండీ ద్వారా రూ. 114.29 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 92.96 లక్షల లడ్డులను భక్తులకు టీటీడీ విక్రయించింది. అలాగే 7.21 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 34.06 లక్షలుగా టీటీడీ అధికారులు ప్రకటించారు.
