సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నేడు, శుక్రవారం అన్ని మునిసిపల్ శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్యం, వర్షాకాలం దృష్ట్యా మురుగు డ్రైన్స్ లో చెత్త తొలగించేందుకు అధికారులు శ్రద్ద పెట్టాలని, ఆదేశిస్తూ..భీమవరం లో గత వైసీపీ పాలకులు పెద్ద తప్పు చేసారని ఆరోపించారు. భీమవరంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కోసం వేండ్ర వద్ద ఉన్న 120 ఎకరాల స్థలంలో ఉన్న 60 ఎకరాల మంచినీటి చెరువుకు అదనంగా ఉన్న 60 ఎకరాల మున్సిపల్ ఖాళీ స్థలం భవిషత్తు లో పెరిగే జనాభా కోసం అలానే ఉంచేస్తే బాగుండేదని దానిని పేదల ఇళ్ల స్థలాల కోసం పంచిపెట్టడం దారుణమైన తప్పు అని .. మరి ఆ తప్పు చేస్తుంటే మీ అధికారులు ఎలా వైసీపీ పాలకులను సమర్ధించారని ప్రశ్నించారు. ఇప్పడు అక్కడ 2869 గృహాలు నిర్మాణం అయితే అక్కడ ప్రజలు వాడకం మురుగు వల్ల మన ప్రజలు త్రాగే నీరు కలుషితం అవుతుందని ఆ మాత్రం తెలుసుకోలేకపోయారని, పేదలకు స్థలాలు కావాలంటే భీమవరం పరిసర ప్రాంతాలలో ఎన్నో వందల ఎకరాలు ఉన్నాయని వాటిని వదిలేసి ఇంత పెద్ద తప్పు చేసారని విమర్శించారు. ఇకపై ఆ ప్రాంతంలో కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని.. అక్కడి గృహాల మురుగు ను మరోవైపు మళ్లించాలని ఆదేశించారు. చంద్రబాబు హయాంలో మహిళల స్వయం ఉపాధి కోసం డ్వాక్రా గ్రూపులు పెడితే గత ఎన్నికలలో డ్వాక్రా మహిళలకు ఆయనకే సున్నం పెట్టారని ఎమెల్య అంజిబాబు విమర్శించారు. భీమవరంలో డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలు చేసిన రాజకీయానికి తానే బాదితుడినని, మీరు రాజకీయ పార్టీలకు ప్రతినిధులుగా మారిపోయారని, ఎన్నికల్లో రాజకీయం డ్వాక్రా గ్రూపుల చుట్టూనే తిరిగాయని, పద్ధతి మార్చుకోవాలని, మాకే కాదు ఏ పార్టీకి వత్తాసు పలకవద్దని, సంఘాల అభివృద్ధికి దృష్టి సారించాలని హెచ్చరించారు. గతంలో మున్సిపాలిటిలో ముగ్గురు సిఅర్పిలు రూ 30 లక్షలు దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారి వద్ద నుండి కేవలం 8 లక్షలు రికవరీ చేసి వదిలెయ్యడం ఏమిటని మెప్మా అధికారిని ప్రశ్నించారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మూడు నెలల సమయం ఇస్తున్న సొమ్ములైన రికవరీ చేయాలి లేదా కేసులు పెట్టాలని, ఈ విషయంలో వదిలే ప్రసక్తే లేదన్నారు.. ఈ సమీక్ష సమావేశం లో మునిసిపల్ కమీషనర్ ఎం.శ్యామల, SE Tidco , PD Housing i/c పిచ్చ్చియ్య , అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ ఎ.శ్రీ విద్య, మునిసిపల్ ఇంజనీర్ పి.త్రినాధ రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి.గౌరు, మునిసిపల్ రెవిన్యూ అధికారి పి.వి.రంగా రావు, మరియు మునిసిపల్ అధికారులు హాజరయ్యారు.
