సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అందరు కరోనా అంటే భయపడుతున్నారు కానీ నిజానికి మన భారత దేశంలో క్యాన్సర్ చాపక్రింద నీరులా మహమ్మారి విరుచుకోనిపడుతుంది. కేవలం గత మూడేళ్లలో (2020–22) దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ రోగం బారిన పడ్డారు. అలాగే మృతుల సంఖ్య కూడా ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇండియన్ కౌన్సి ల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎం ఆర్) ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న నేషనల్ క్యా న్స ర్ రిజిస్ట్రీప్రోగ్రామ్లో ఈ వివరాలు పొందుపరిచింది. ఇటీవల కేం ద్ర వైద్య శాఖ మం త్రి మాండవీయా లోక్ సభలో వివరించారు… దేశవ్యా ప్తంగా 2020లో 13,92,179 కేసులు నమోదవగా 2021లో 14,26,447 కేసులు, 2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 7.70 లక్షలు, 2021లో 7.89 లక్షలు, 2022లో 8.08లక్షల మరణాలు నమోదయ్యా యి. కేసులు, మరణాలు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. 2022లో ఉత్తరప్రదేశ్లో 2,10,958 కేసులు, 1,16,818 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లోమహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఏపీలో 73,536 క్యా న్స ర్ కేసులు నమోదవగా, 40,307 మంది మరణించినట్లు ఆ గణాంకాలు తెలిపాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ వైఎస్సా ర్ ఆరోగ్య శ్రీ పథకంలోకి .చేర్చారు.. ఇప్ప టివరకు క్యాన్సర్ చికిత్సలకే రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రారంభ దశలోనే వ్యా ధిని గుర్తించి, ప్రాణాపాయ పరిస్థితులను తప్పించడానికి సామూహిక క్యాన్సర్ స్క్రీ నింగ్ చేప్పట్టడం విశేషం. .
