సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, శనివారం మార్కాపురంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం మాట్లాడుతూ.. డ్వాక్రా తో రాష్ట్రంలో మహిళలను స్వయం ఉపాధి కోసం ప్రోత్సహించానని అన్నారు. పొదుపు ఉద్యమంతో మహిళలు రాష్ట్రంలో ముందున్నారు అన్నారు. పొదుపు వల్ల మహిళలు.. తమ పిల్లలను చదివించుకుంటున్నారని, చిన్న వ్యాపారాలు పెట్టుకుంటున్నారన్నారు. మహిళల గౌరవం పెరిగిందన్నారు. ఇంట్లో వారు మహిళలను గౌరవిస్తున్నారంటే ఆనాడు తాను ఆలోచించిన విధానమే కారణమన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాలు, మెప్మా సంఘాల వారికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తులుగా తయారు చేస్తామన్నారు. ‘నా కుటుంబంతో పాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థ ని భువనేశ్వరి డెవలప్ చేశారు. నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాను ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో మహిళలు స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి లేదు.మహిళలను బలవంతంగా వాళ్ళ మీటింగ్‌కు తీసుకువచ్చి బయటకు వెళ్ళకుండా చుట్టూ గుంటలు తీసేవాళ్ళు.ని ఆరోపించారు,. చైనా, జపాన్‌లో జనం సంఖ్య తగ్గిపోతోందని.. సంపాదించింది అనుభవించడానికి కూడా వారసులు లేకుండా పోతున్నారన్నారు. గతంలో ఒక్కరినే కనమని చెప్పానని.. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మందిని కనమని చెబుతున్నానని తెలిపారు.
