సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మండలం లో నేడు, ఆదివారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లోసరి పంచాయతీ గరవల దిబ్బ గ్రామంలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం ను తాజగా నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుండి వర్షం పడుతున్నప్పటికీ ప్రతి ఇంటికి వెళ్లి ..ఆ కుటుంబానికి సీఎం జగన్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వారికీ వివరిస్తూ, వాటిని సద్వినియోగం చేసుకొంటున్నారా? మీకు ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా? అని అడుగుతూ, స్థానిక ప్రజా సమస్యలు తన దృష్టికి వస్తే అవకాశం ఉన్నంత మేరకు అక్కడికి అక్కడే సంబంధిత అధికారుల కు ఆదేశాలు ఇస్తూ నిర్ణిత సమయానికి పని పూర్తీ చెయ్యాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది,ఎంపీపీ పేరిచర్ల విజయనసింహరాజు, జడ్పిటిసి కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరు మాని ఏడుకొండలు, వైస్ ఎంపీపీ తిరు మా ని గంగాభవాని ధనుంజయ, వైసిపి నేతలు, స్థానిక ప్రజలు పాల్గొంటున్నారు.
