సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది.ఇజ్రాయిల్ తో పాటు అమెరికా అడ్జక్షుడు ట్రంప్ కు సహకరించారన్న కోపంతో తన దేశ సరిహద్దులలో ఉన్న 11గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై, భారీ వ్యాపార సంస్థలపై ఇరాన్‌ ప్రతీకారంతో ఏకబిగిగా మిస్సైల్‌ దాడులతో భారీ విద్వంసాలతో చెలరేగిపోతుంది. ఇరాన్ కోపానికి కువైట్‌, మస్కట్‌, సౌదీ అరేబియా బహ్రెయిన్‌, ఇరాక్‌ తదితర దేశాలలో భారీ విద్వంసం జరుగుతుంది. పలు క్రూడాయిల్ ప్లాంట్ లు భస్మీపటలం అవుతున్నాయి. పలువురు అమాయకులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉపాధి, ఉద్యోగాలు కోసం వెళ్లిన వివిధ ప్రాంతాల తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది మహిళలు, యువత బ్రతుకు తెరువు కోసం అయినవారికి దూరమై గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు.సుమారు 30 వేల మంది వరకూ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. నరసాపురం’ మరియు ఇక్కడికి సమీపంలోని కోనసీమ జిల్లాలోని ‘మల్కిపురం, సఖినేటి పల్లి’ తదితర ప్రాంతాలలోని సుమారు 40 వేల మంది పైగా గల్ఫ్ దేశాలలో అత్యధికంగా పని చేస్తుండటం విశేషం. అకస్మాత్తుగా యుద్ధం రావడంతో వీరి బంఽధువులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. గల్ఫ్‌లో వున్న తమ వారితో తరచూ ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటి కప్పుడు మీడియా ఛానెల్స్ లో అక్కడి దాడులు చూసి స్థానికుల్లో అందోళన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *