సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో నేడు, సోమవారం అంతర్జాతీయంగా మరియు దేశీయ సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం కూడా నెగిటివ్‌గా మారాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ మరింత దారుణంగా పతనమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి ( stock market). గత సెషన్ ముగింపు (81,287)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఏకంగా 2700 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి కొద్దిగా తేరుకున్నాయి. అయితే సెన్సెక్స్‌, నిఫ్టీలో భారత్ డైనమిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, హిందుస్థాన్ జింక్, కేఈఐ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 422 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 579 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.36గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *