సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం కొణితివాడ 2 లోని గవరపాలెం లో 40 లక్షల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్నిస్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. గ్రామా స్వరాజ్యమ్ లక్ష్యంగా సీఎం జగన్ ప్రతి గ్రామానికి స్వంత సచివాలయ భవనాలను కోట్ల రూపాయల ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నారని , ఈ రోజు మీ గ్రామా ప్రజలకు ఆధునిక హంగులతో నూతన సచివాలయ భవనం ఏర్పాటు చేశామని , ఇకపై మీకు కావలసిన అన్ని సర్టిఫికెట్లు తో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం ఇక్కడ నుండే అందుతుందని అందరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఉత్సహ పూర్తితంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి శ్రేణులు అధికారులు, వీరవాసరం జడ్పీటిసి ,గుండా జనసేననేత జయప్రకాష్ నాయుడు పాల్గొన్నారు.
