సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చేతుల మీదుగా బెస్ట్ ఎలకో్ట్రలర్ ప్రాక్టీస్ అవార్డు అందుకున్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాకేంద్రంలో జరిగిన 13వ నేషనల్ ఓటర్స్‌డే సందర్భంగా ఈ అవార్డు అందుకున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలను సమర్ధవంతంగా పూర్తిచేసినందుకు, జిల్లాలో అత్యధిక ఓటర్లు నమోదు చేసినందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ముగ్గురు కలెక్టర్లలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఉండటం పట్ల భీమవరం జిల్లా కలెక్టరేటులోని జిల్లా అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
