సిగ్మాతెలుగు డాట్, ఇన్,న్యూస్: నేడు, సోమవారం, విజయవాడ రాజ్ భావన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మెన్, కొయ్యే మోషేను రాజు కలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొయ్యే మోషేను రాజు ను గవర్నర్ అభినందించి సమర్ధవంతంగా సభను నడిపి ప్రతిష్ట పెంచుకోవాలని సూచించడం జరిగింది. ఇటీవల అనారోగ్యం నుండి కోలుకున్న గవర్నర్ విశ్వ భూషణ్ క్షేమ సమాచారాలును రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు అడిగితెలుసుకోవడం జరిగింది.
