సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కు చత్తీ‌స్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించింది. తదుపరి నేడు బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్టు లో ప్రభుత్వం వీడ్కోలు పలికింది. గవర్నర్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చత్తీ‌స్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన బిశ్వ భూషణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. రాష్ట్రాన్ని వీడుతున్నందుకు ఎంతోబాధగా ఉన్నప్పటికీ కేంద్రం తనకు మరో బాధ్యత అప్పగించిందన్నారు. తనకు సహకరించిన ఏపీ ప్రజాప్రతినిదులు అధికారులకు కృతజ్ఞలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *