సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శకుడు ప్రవీణ్ సత్తారు 2017 లో రాజశేఖర్ హీరోగా ‘పిఎస్వి గరుడవేగ’ అనే సినిమా తీసాడు. అది ఒక మంచి గూఢచారి నేపథ్యంలో వచ్చిన హాలివుడ్ స్థాయి యాక్షన్ సినిమా గా సూపర్ హిట్ అయ్యింది. చాల గ్యాప్ తరువాత నాగార్జున హీరోగా వచ్చిన ఇంకో యాక్షన్ సినిమా ‘ది ఘోస్ట్’ ఇది ఒక ఫెయిల్యూర్. అయితే ఇప్పుడు కొత్తగా మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ‘గాండీవధారి అర్జున‘ తో నేడు, ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూర్య హీరోగా వచ్చిన సింగం 3 ని పోలి ఉంది. ఇక కధ విషయానికి వస్తే.. భారత దేశానికీ చెందిన కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) లండన్ లో జరుగుతున్న గ్లోబల్ సమావేశానికి హాజరవుతాడు. ఆయనతో పాటు అతని పీఏ ఐరా (సాక్షి వైద్య) కూడా ఉంటుంది. అతన్ని రహస్యంగా కలిసి ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడానికి శృతి (రోషిణి ప్రకాష్) అనే అమ్మాయి ప్రయత్నం చేస్తుంది, కానీ అప్పుడు మంత్రి మీద ఎటాక్ జరుగుతుంది. అందులో మంత్రికి సెక్యూరిటీగా వున్న వ్యక్తి గాయపడతాడు, కానీ మంత్రికి ప్రాణహాని ఉందని తెలిసి గాయపడిన అతను అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) అనే అతన్ని మంత్రికి సెక్యూరిటీ గా ఉంటే బాగుంటుంది అని చెప్తాడు.ఆదిత్య రాజ్ పీఏ, అర్జున్ వర్మ ఒక్కప్పుడు ఇద్దరూ ప్రేమికులు, మొదట్లో ఐరా నిరాకరించినా, మంత్రి బాగోగులు గురించి అలోచించి అర్జున్ వర్మకి ఒకే చెపుతుంది. ఈలోగా లండన్ వెళ్లిన కేంద్ర మంత్రి గ్లోబల్ మీట్ లో విదేశీయ కంపెనీలు భారత దేశంలో డంప్ చేస్తున్న చెత్తని ఏ విధంగా ఆపాలి అనే ఫైల్ మీద సంతకం పెట్టకుండా రణవీర్ (వినయ్ రాయి) అడ్డుకుంటాడు? కేంద్రమంత్రిని అర్జున్ వర్మ ఎలా కాపాడాడు? వీటన్నిటికీ సమాధానాలు వెండి తెరపై చూడాలి. ఇక సినిమా గతంలో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చేసిన గరుడ వేగా.. టేకింగ్, యాక్షన్ స్థాయిలో లేదు. వరుణ్ తేజ్ పాత్రని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. వరుణ్ తేజ్ కటౌట్ కి తగ్గట్టు జేమ్స్ బాండ్ తరహాలో స్టైల్ గా బాగా నటించాడు. రా ఏజెంట్ గా మొదట్లో పాత్ర బలంగా చూపించాడు, మళ్ళీ కేంద్రమంత్రికి సెక్యూరిటీ గా చూపించారు. అలాగే సాక్షి వైద్య, వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత బలంగా లేదు.లండన్ లో తీయడం వలన ఫోటో గ్రపీ బాగుంది, అంటే విజువల్స్ చాలా బాగున్నాయి. అక్కడక్కడా పోరాట సన్నివేశాలు బాగున్నాయి. అయితే పీల్ అయ్యేలా భావోద్వేగాలు లేవు.అయితే చివర్లో నాజర్ స్పీచ్ బాగుంది. మొత్తానికి సో.. సో గా అర్జున గాండీవధరి ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *