సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హమాస్ వంటి తీవ్ర వాద సంస్థ 2 ఏళ్ళ క్రితం ఇజ్రాయిల్ ప్రజలు ఫై జరిపిన పాశవిక మారణకాండ కు ప్రతీకారంగా ఇజ్రాయిల్ మొత్తం గాజా సిటీలోని ప్రజలను అమెరికా సాయంతో బయటకు పంపే ఎత్తుగడలో భాగంగా హమాస్ తీవ్ర వాదులతో పాటు అమాయక గాజా ప్రజలు ఆస్తులు కోల్పోయి వేలాదిగా హతం అవుతుండటం ప్రపంచం మొత్తం చూస్తూనే ఉండిపోయింది. ఒక జాతిపై రక్తపాతం మరో జాతి 10 రేట్లు రక్తపాతం ప్రతీకారం కోరుకొంటుంటుంది. ఇక్కడ జాతి పేరుతొ మనుష్యులు ప్రాణాలకు విలువ లేదు. తాజగా అమెరికా సైన్యం కూడా తమ పౌరులకు ఆహారం అందించే మానవతా సాయం ముసుగులో మారణహోమం సృష్టిస్తున్నారని గాజా ఆరోగ్య శాఖ ఆరోపించింది. గత 24 గంటలలో అమెరికా భద్రతా కాంట్రాక్టర్లు జరిపిన కాల్పు ల్లో 118 మంది చనిపోయారని తెలిపింది. ప్రస్తుతం అమెరికాకు చెందిన గాజా హ్యు మానిటేరియన్ ఫౌండేషన్ సంస్థ.. నాలుగు క్యాంప్‌లు ఏర్పాటు చేసి ఆహారం , నిత్యా వసర వస్తువులు పం పిణీ సాయం అందిస్తోంది. అలా పంపిణీ జరుగుతుండగా గార్డులు జరిపిన దాడుల్లో 118 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కాల్పులు జరుపుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. ఐతే ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *