సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన ప్రతి సినిమాను హీరోలు వేరయినా సరే.. సీక్వల్ తరహాలో కథలతో పాత్రలతో ఆడుకొంటూ సినిమాలు తీసే తమిళ సంచలన దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెలుగులో మార్కెట్ లేని తమిళ టాప్ హీరో విజయ్ తోపాటు యాక్షన్ హీరో అర్జున్, సంజయ్ దత్ లు త్రిష ప్రధాన పాత్రలలో రూపొందిన ‘లియో’ తెలుగునాట కూడా భారీ స్థాయి థియేటర్స్ లో నేడు, గురువారం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కధ విషయానికి వస్తే జగపతి బాబు హీరోగా రాంగోపాల్ వర్మ నిర్మించిన గాయం 2 తరహా కథను చాల పోలి ఉంది. ఇక కథలోకి వెళ్ళితే.. పార్తి అలియాస్ పార్తిబన్ (విజయ్ ) హిమాచల్ ప్రదేశ్ లోని థియోగ్లో స్థిరపడిన తెలుగువాడు, అతని భార్య సత్య (త్రిష ) బాబు, పాప లతో కలసి ఓ కేఫ్ నడుపుకొంటూ 20ఏళ్లుగా అక్క డే కుటుంబం తో కలిసి జీవనం సాగిస్తుంటాడు. వారి సంతోష జీవితంలో ఓ క్రిమినల్ ముఠా ఓ రాత్రి తన కేఫ్ లోకి వచ్చి డబ్బులు దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ ముఠాను అక్కడిక్క డే కాల్చి చం పేస్తాడు పార్తి. అయితే తను ఆత్మ రక్షణ కోసమే వాళ్లను చంపినట్లు కోర్టులో తేలడం తో నిర్దోషిగా విడుదలవుతాడు. కానీ, ఓ మీడియా పత్రికలో అతని ఫొటో చూసిన ఆంటోని దాస్ (సంజయ్ దత్) గ్యాం గ్ పార్తిని వెంటాడుతుంది. మరో వైపు హెరాల్డ్ దాస్ (అర్జున్) వేటాడుతుంటారు. దీనికి కారణంఏమిటి? మరి ఈ లియో ఎవరు? అతను.. పార్తిబన్ ఒక్క డేనా?లేక ఇద్దరా? కధలో ఎన్ని ట్విస్టులు ఉన్న సెంకండ్ హాఫ్ కొంత సాగదీతగా కనపడుతుంది. హెరాల్డ్ దాస్ పాత్ర లో అర్జున్ పరిచయం చేసిన తీరు బాగుంది. మంచి పిట్ గా ఉన్న అర్జున్ తో విజయ్ చేసిన 3 నిమిషాల ఫైట్ దానిని ఒకేషాట్ లో చిత్రీకరించిన తీరు బాగుంది. విరామానికి ముందొచ్చే రెండు యాక్షన్ సీక్వెన్స్ లోకేష్ తన మార్కుతో బాగా తీశారు. కానీ ‘విక్రమ్’, ‘ఖైదీ’ చిత్రాల క్లైమాక్స్ లో ఉన్న పట్టు ఈ సినిమాలో కనపడదు.. హీరో విజయ్ 2 పాత్రలలో కనిపించిన తీరు.. ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి.తల్లి పాత్రలో త్రిష చక్క గా ఒదిగిపోయింది. ఇక మూఢనమ్మకాలు విశ్వసించే మూర్కుడుగా సంజయ్ దత్, అర్జున్ దమ్మున్న పాత్రల్లో కనిపించారు. కానీ వారి పాత్రలు ముగింపు వారి స్థాయిలో లేదు. చివరిలో విక్రమ్ (కమల్ హాసన్) లియోకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చూపించారు అనిరుధ్ నేపథ్య సంగీతం అద్భుతం అంతే .. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ మరో హైలైట్..
