సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దసరా మహోత్సవాలలోభాగంగా నేడు, శనివారం శ్రీ అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ఆవరణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలులో నేటి సాయంత్రం వేద పండితులతో నిర్వహించిన వేద సభ ఆహుతులను సాంప్రదాయ వాదులను అలరించింది. విశాఖపట్టణం కి చెందిన భాస్కర భట్ల సత్య ప్రసాద్ శర్మచే మరియు వివిధ దేవస్థానం లు కి చెందిన వేద పండితులచే వేద విద్య సభ కార్యక్రమం మావుళ్ళమ్మ దేవస్థానం ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించినారు. సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
