సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యంగ్ ఎన్టీఆర్ పెద్ద ప్రమాదానికి గురైన విషయం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాస్తవ సమాచారం ప్రకారం…ఇటీవల హైదరాబాద్ లో జరుగుతున్న ఒక యాడ్ షూట్ లో భాగంగా ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. తాజాగా నేడు, శనివారం ఈ విషయంపై అధికారికంగా స్పందించారు ఎన్టీఆర్ టీం. ఈమేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. “యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి చిన్న ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలు అయ్యాయి. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యం తో కోలుకోవడానికి ఆయన రెండు(Ntr) వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హామీ ఇస్తున్నాం. అభిమానులు, మీడియా ఎలాంటి ఊహాగానాలకు లోనుకాకుండా, సహకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అంటూ పేర్కొన్నారు.
