సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ జనసేన పార్టీలు మొన్న ఎదో గాలిలో గెలిచిన గాలి నా.. అంటూ, ఇటీవల నగరిలో జరిగిన వైసీపీ సమావేశంలో వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో మీడియాలో వైరల్ అవుతుంది. ఎదో గాలివాటున అధికారం వచ్చిందని టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టు వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తే హింసిస్తూ ..తాము అధికారంలోకి వచ్చాక దానికి వంద రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించ్చారు. రాష్ట్రములో ప్రజల సంక్షేమం లేదని అంత అవినీతి మయం చేసారని, ఏపీలో సీఎం గా , ఉప సిఎంలుగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ,శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోతారని మళ్ళీ సోమవారం ఏపీకి వస్తారని ఇటువంటి వీకెండ్ మంత్రులు ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కాదు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారని టీడీపీ జనసేన క్యాడర్ ను వదిలేసి అమెరికా వెళ్ళిపోతారని అటువంటి వారి అండ చూసుకొని మీరు వైసీపీ మీద రెచ్చిపోతే.. తరువాత మూల్యం చెల్లిస్తారని అన్నారు. ఇక్కడ తిరుమల లో పవిత్ర గోవులు చనిపోతే , శ్రీకాకుళం శ్రీ కూర్మంలో వందలాది పవిత్ర తాబేళ్లు చనిపోతే ఆ క్షేత్రాలకు రాని పవన్ కళ్యాణ్ తమినాడు వెళ్లి అక్కడివాడినని అక్కడ హిందూ ధర్మం రక్షిస్తానని అంటాడేమిటి అని ఎద్దేవా చేసారు. రోజా వ్యాఖ్యలపై జనసేన టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
