సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొన్ని నెలలు విరామం తరువాత సూపర్ స్టార్, మహేశ్ హీరోగా భీమవరం బ్రాండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘గుంటూరు కారం’ కొన్ని నెలలు విరామం తరువాత షూటింగ్ చిత్రీకరణ గత శనివారం మొదలైంది. తాజా షెడ్యూల్ కోసం మహేశ్ బాబు హైదరాబాద్ శివార్లో కొత్త షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. శ్రీలీల ఓ కథానాయిక. మరో నాయికగా పూజ హెగ్డే స్థానం లో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబీ29’ గురించి కధ రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ను 2 భాగాలుగా నిర్మించే అవకాశం ఉందని మరోసారి ప్రకటించారు. ‘‘జులైలోపు స్ర్కిప్ట్ పనులు పూర్తి చేసి, రాజమౌళికి అందజేయనున్నట్టు ఆయన చెప్పారు. ఆ చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆస్కారం ఉందని క్లైమాక్స్ సన్నివేశాలు అందుకు అనుగుణంగా ముందే కథను 2 భాగాలుగా మలచినట్లు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఇచ్చిన సమాచారం ఈ చిత్రానికి సీక్వెల్స్ పక్కా అని తెలుస్తోంది.
