సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణ సీఎం కెసిఆర్ బి ఆర్ ఎస్ అధినేతగా హాజరు కాకుండానే.. .. ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) రాష్ట్ర కార్యాలయం నేడు, ఆదివారం ప్రారంభమైంది.. గుంటూరులోని ఆటోనగర్‌లో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం ..ఇటీవల పరిణామాలు గమనిస్తే బీజేపీకి దేశం లో ఎదురు గాలి వీస్తోందన్న రు. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బీఆర్ఎస్ వల్లనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాలను అభివృ ద్ధిలో నడిపించాలనే కేసీఆర్ ఈ పార్టీ పెట్టారని తెలిపారు..ఏపీ అభివృ ద్ధి పథం లో వెనుకబడి ఉందని గత ఐదు సం వత్స రాలుగా ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నా రు.. అలాగే కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు తీసుకు రావటం లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపిం చారు. ఇంత వరకు రాజధాని నిర్మిం చుకోలేక పోయాం .. పోలవరం ప్రాజెక్టు కూడా అర్ధాంతరం గా ఆగిపోయిందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ, ఇం త వరకు నెరవేర్చ లేదని ఆరోపణలు గుప్పిం చారు బీఆర్ఎస్ పార్టీ ని ఏపీ ప్రజలు ఆదరిస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *