సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లాలో వట్టిచెరుకూరు సమీపంలో నేడు, సోమవారం మధ్యాహ్నం ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కొండేపాడు నుంచి జూపూడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.
