సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గుజరాత్, మోర్బీ నగరంలో మచ్చు నదిపై గత రాత్రి కేబుల్స్ తో నిర్మించిన తీగెల వంతెన ఫై 500 మందిపైగా ఉండగా.. ఒక్కసారిగా తెగిపోవడంతో ఆ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకూ 134 మంది మరణించారు. అనేక మంది తీవ్ర గాయాలు పాలు అయ్యారు. కొందరు క్రింద మచ్చునది బురదలో కురుకొనిపోయారు. ఇంకా మృతుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. గుజరాత్ లోని బీజేపీ కి చెందిన రాజ్కోట్ ఎంపీ మోహన్భాయ్ కల్యాణ్జీ అయన సోదరి కుటుంబసభ్యులు 12 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబంలో మరింత విషాదం నింపింది. బ్రిటిష్ కాలం నాటి ఈ తీగల వంతెన ను 7 నెలలు పాటు రిపేరు చేసి ఈ నెల 26వ తేదీన తిరిగి ప్రారంభించడం గమనార్హం.. ఈ విషాద ఘటనపై నేడు, సోమవారం.. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలో ఉన్న భారీ ఐక్యతా ప్రతిమ వద్ద నివాళ్లు అర్పించిన ప్రధానిమోడీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేవడియాలో ఉన్నా .. నా ఆలోచనంతా మోర్బీ బాధితుల గురించే. ఇంతటి బాధను అనుభవించిన వారికి, వారి కుటుంబాలకు సహాయక చర్యల్లో ఎలాం టి అలసత్వం ఉండదని మీకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ( ఫై దృశ్యాలు ప్రమాదం జరిగినప్పుడు సిసి ఫుటేజిలోనివి)
