సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి.. వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను గన్‌మెన్లు బయటికి పంపించేశారు. గత 2 నెలలుగా ఏకబిగిగా ఎన్నికల నేపథ్యంలో పని చెయ్యడం తదుపరి క్యాడర్ తో చర్చలలో మునిగి తేలటం వల్ల, నిద్ర తిండి సమయ పాలన లేకపోవడంతో నిస్సత్తువ ఆవహించిందని భావిస్తున్నారు. ప్రధమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నాని కాస్త కోలుకున్నక .. వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. అతి శ్రమ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్‌మెన్లు, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు కొడాలి కుటుంబ సభ్యులు బయల్దేరారు.నానికి ఇలా అయ్యిందని తెలుసుకున్న వీరాభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొడాలి ఇంటికి చేరుకుంటున్నారు.
