సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న లక్షలాది వాలంటీర్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్స్‌కు ఇస్తున్న గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేడు, గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కానుకగా జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి మరో సారి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని అయితే ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా తిరిగి జగన్ సీఎంగా అధికారంలోకి వస్తారని మంత్రి కారుమూరి ధీమా వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *