సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ ప్రారంభంగా ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణల్లో.. కేవలం రెండు స్లాబులకే జీఎస్టీలను పరిమితం చేసింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా 5శాతం స్లాబు పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా ఈ నెల 22 నుండి రాష్ట్రంలో పాల ధరలు తగ్గనున్నాయి. సంగం, విజయ డెయిరీలు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు.. పన్నీరు, వెన్న, నెయ్యి వంటి ఇతర పాల ఉత్పత్తుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ఆయా డెయిరీలు ప్రకటించాయి. జీఎస్టీ తగ్గడంతో విజయ (టెట్రా) పాలు లీటరుపై రూ.5, పన్నీరు కిలో రూ.20, వెన్న కిలో రూ.30, నెయ్యి కిలో రూ.30, ప్లైవర్డ్ మిల్క్ లీటరుపై రూ.5 వరకు ధరలు తగ్గాయి. సంగం డెయిరీ పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయి. యూహెచ్‌టీ పాలు లీటరుపై రూ.2, పన్నీరు ఫై కిలో రూ.15, నెయ్యి కిలో రూ.30, వెన్న కిలో రూ.30, మిల్క్ షేక్ లు లీటరు రూ.5, బేకరీ ప్రొడక్టుల కిలోపై రూ.20 తగ్గించినట్లు చెప్పారు. ఇప్పటికే సబ్బులు, షాంపులు, ఇతర వస్తువుల ధరలను తగ్గిస్తూ ఆయా కంపెనీలు ప్రకటించాయి
