సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం సాయంత్రం గుడ్ ఫ్రైడే సంధర్భంగా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలోని వడ్డిగూడెం గ్రామం వద్ద బైబిల్ మిషన్ చర్చ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు మరియు స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ,మేడిది జాన్సన్ , నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని, గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. నేటి ఉదయం భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి నౌండ్రు వెంకటరమణా రావు,ఎంపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిసి సంఘాల తరుపున విస్త్రుత ప్రచారం చేసి గూడూరి ఉమాబాలని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.పలువురు బిసి సంఘాల నేతలు కూడా ఆమెను కలసి తమ మద్దతు తెలిపారు.
