సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలోని శ్రీవిద్యా గణపతి స్వామివారి 12వ వార్షిక మహోత్సవ వేడుకలలో భాగంగా నేడు, బుధవారం అష్టోత్తర శతకలశ పూర్వక మహా కుంభాభిషేకం నిర్వహించారు. శ్రీఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో విద్య గణపతి ఆలయంలో నుంచి 108 మంది మహిళా భక్తులు కలశలతో పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కలశ ఊరేగింపు ను ప్రారంభించారు. ముందుగా విద్య గణపతి స్వామి వారిని దర్శించుకుని.. పుష్కర కాలం దాటిన దేవాలయానికి మహా కుంభాభిషేకం నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం స్వామివారికి శిఖరానికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు హనుమ కిరణ్, అయ్యప్ప, వారణాసి పోలీస్, చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజ్యోసుల ప్రసాద్, వేలూరి సుబ్రహ్మణ్యం, మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
