సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములు నేపథ్యంలో నేడు, మొదటి కార్తీక సోమవారం తెల్లవారు జాము 3 గంటల నుండి వేలాది భక్తులు శ్రీ సోమేశ్వరుని దర్శించుకొన్నారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది స్వచ్చంద కార్యకర్తలు చక్కటి ఏర్పాట్లు చేసారు. ప్రసాద వితరణ చేసారు. 3వ రోజు గత ఆదివారం కూడా వేలాదిగా భక్తులు దర్శించుకొన్నారు. , రూ.200/-ల దర్శనం వలన రూ.1,05,000/-, రూ.100/-ల దర్శనం వలన రూ.1,74,700/-, రూ.50/-ల దర్శనం వలన రూ.1,18,000/-, కానుకలు ద్వారా రూ.700/-, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.1,32,404/-లు మెత్తం ర5,30,104/-లు ఆధాయం రాగా 8,000 మంది భక్తులకు గొట్టుముక్కల భీమరాజు, వెంప వారి చే అన్నప్రసాదం వితరణ చేయుట జరిగిందని ఆలయ ఇఓ రామకృష్ణంరాజు ఒక ప్రకటన లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *