సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు ఈనెల ది.24-02-2025 నుండి ది.28-02-2025 వరకు వార్షిక కళ్యాణోత్సవములు(మహాశివరాత్రి కళ్యాణోత్సవములు ఏర్పాట్లు నిమిత్తం స్థానిక గ్రామస్తులతో నేటి బుధవారం సాయంత్రం దేవాలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణంరాజు సమావేశము ఏర్పాటు చేసి ఉత్సవాల నిర్వహణకు వారి సహకారంను ఏర్పాట్లలో వారి సూచనలను తీసుకోవడం జరిగింది. స్కంద పురాణం ప్రకారం సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్టించాడని, చంద్రునికి మరో పేరు సోముడు పేరుమీదే పరమేశ్వరుడు సోమేశ్వరుడుగా ఇక్కడ వెలిశాడని భక్తులు నమ్మకం. ప్రపంచంలో రంగులు మారె ఏకైక శివలింగం ఇక్కడ ప్రత్యకత. అందుకే మహాశివరాత్రి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలోనే అగ్ర స్థాయిలో ఇక్కడ 5 రోజులు పాటువేలాది భక్తుల సమక్షంలో రధోత్సవాలు, తెప్పోత్సవాలతో వైభవంగా నిర్వహిస్తారని ప్రతీతి.
