సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణములోని గునుపూడి లో గ్రామా దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్య లక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం స్థానిక 18 వ వార్డు ప్రజలు ఆధ్వర్యంలో ఈ నెల 6 వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ అమ్మవారి పుర ఊరేగింపు మేళతాళాలు డప్పులు, కళాకారుల విన్యాసాలు తో జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని అస్సిసులు తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆగస్టు నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి అన్నసమారాధన నిర్వహిస్తారు.
