సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని గునుపూడి గ్రామా దేవతగా వందల ఏళ్లుగా ప్రసిద్ధి పొందిన శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ వారి’ దేవాలయం వద్ద ఉగాది’ జాతర మహోత్సవాలు లో భాగంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళలో ప్రతి రోజు విశేషముగా భక్తులచే కుంకుమ అర్చనలు, ప్రసాద వితరణలు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ప్రారంభమయిన ఈ జాతర వేడుకలు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం ఉగాది పర్వదినం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉగాది రోజు ఉదయం 5 గంటలా నుండి శ్రీ అమ్మవారికి భక్తులచే చలివిడి వడపప్పు, పానకం నివేదనలు, మొక్కుబడులు సమర్పణ, గారెలు బూరెలు, మిఠాయి పులిహోర,పంచ భక్ష్య పరమాన్నాలతో మహానివేదన చేస్తారు. తదుపరి సాంప్రదాయ ప్రదర్శనలు, డప్పువాయిద్యాలు. గరగల నృత్యాలుతో అమ్మవారి గ్రామా ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. దేవాలయ ధర్మకర్తల కమిటీ చైర్మెన్ ఏలూరి సాయి సత్యనారాయణ, సభ్యులు, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
