సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు నేడు, ఆదివారం గునుపూడి సౌత్ డ్రైన్ ను పరిశీలించారు..ఈ సందర్భంగా స్థానికులు చెప్పిన సమస్యలు విన్నారు. అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్రపు డెక్క తొలగింపుకు డ్రోన్ స్ప్రేయర్ ను ఉపయోగించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.భీమవరం రూరల్ మండలం దిరుసుమర్రు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. భీమవరం పట్టణంలోని బ్యాంకు కాలనీ లోని ఒక పేద విద్యార్థినికి స్థానిక దాతల సహకారంతో ఉచితంగా సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు,కౌరు పృధ్వి శంకర్, వ్యవసాయ శాఖ, డ్రైనేజీ అధికారులు, రైతులు,జనసేన బిజెపి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
