సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: రేపటి నుండి గూగుల్ అనేక జీమెయిల్ అకౌంట్లను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఎవరైనా తమ జీ మెయిల్ అకౌంట్ ను గత రెండేళ్లుగా ఉపయోగించడం లేదా?. ఎందుకంటే సెప్టెంబర్ 20, 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ ఇస్తున్నాము. Gmail Accounts: గూగుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ Gmail ID ఉంటుంది. చాలా మంది దానిని యాక్టివ్‌గా ఉంచుతారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాల పాటు యాక్టివ్‌గా లేని జీమెయిల్ ఖాతాలను గూగుల్ తీసివేయనుంది. దీంతో గూగుల్ తన సర్వర్ స్థలాన్ని ఖాళీ చేయబోతోంది. ఈ క్రమంలో అలాంటి వారు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని కూడా అలర్ట్ చేసింది. ముందుగా మీ Gmail ఖాతా డియాక్టివేట్ కాకుండా కాపాడుకోవాలనుకుంటే, మీరు మీ Gmail ఖాతాకు లాగిన్ అవ్వాలిఆ తర్వాత మీ ఖాతా నుంచి ఎవరికైనా ఇమెయిల్‌లను పంపండి, లేదా ఇన్ బాక్సులో ఉన్న మెయిల్‌లను చదవండి అప్పుడు మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది మీరు మీ Google ఫోటోల ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా ఫోటోలను, వీడియోలను షేర్ చేసినా కూడా మీరు మీ Gmail ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు
