సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగం పెరిగిపోవడంతో ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తకొత్త మార్గాల్లో జనాలను లేకుంటే ఏకంగా బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల విషయంలో వినియోగదారుల మరింత అప్రమత్తం చేయడం లక్ష్యంగా ‘ఫ్రాడ్ డిటెక్షన్’ను (fraud detection) డిజిటల్ పేమెంట్ యాప్ ‘గూగుల్ పే’ ప్రవేశపెట్టింది. యాప్ చెల్లింపుల్లో మోసాల గుర్తింపు, అప్రమత్తలను మరింత పెంచడమే ముఖ్య ఉ ద్దేశ్యంగా మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించినట్టు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి అనుమానిత యాక్టివిటీని గుర్తించినా వెంటనే యూజర్లకు మల్టీ-లేయర్ అలెర్ట్స్, హెచ్చరికలు జారీ అవుతాయి.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ లావాదేవీల హిస్టరీని కూడా పొందొచ్చు. ‘ఈ వారంలో నిత్యావసరాలపై ఎంత ఖర్చు చేశాం?’ అనే ప్రశ్న మాదిరిగానే హిస్తరీని చెక్ చేసుకోవచ్చు. తద్వారా యూజర్లు సేఫ్ ఇన్ఫర్మేషన్‌ను పొందొచ్చని ప్రకటించింది.
