సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజలకు భీమవరం మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ ఒక ముఖ్య హెచ్చరిక జారీ చేసారు. ఇటీవల దినేష్ రెడ్డి అనే పేరుతో భీమవరం కమీషనర్ గా పనిచేస్తున్నాను అని వ్యాపారస్తులు కు కాల్ చేస్తూ D&O ట్రేడ్ లైసెన్స్ లు మీరు పెండింగ్ ఉన్నారు అని QR కోడ్ తో వేల రూపాయల అమౌంట్ ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగంతకులు కాల్ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ..ఈ విషయంలో ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండి ఇటివంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులు కు ఫిర్యాదు చేయండి. ఏ పన్ను అయినా సచివాలయంలో లేదా మెయిన్ ఆఫీస్ కౌంటర్లు లేదా CDMA వెబ్ సైట్ ద్వారామాత్రమే కట్టాలి. అంతే కానీ phone pay , గూగుల్ పే లేదా QR కోడ్లు చెల్లింపులు ఉండవు అని మునిపల్ కమిషనర్ తెలిపారు.
