సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోన్ యాప్ పేరుతొ ప్రజలను రుణాలకు ప్రేరేపించి వారి జీవితాలను ఒక ఆట వాడుకొంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. తాజా వార్త కధనం ప్రకారం.. వినియోగదారుల భద్రతను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్న ? ఈజీ క్యాష్, ఏ ఏ క్రిడిట్. అమౌర్ క్యాష్…వంటి 18 లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. వాటిల్లో చాలా వరకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నవే కావడం గమనార్హం. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. యూజర్స్ భద్రతకు ముప్పు వాటిల్లేలా 18 యాప్ లు గూఢ చర్యం చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. ఈ యాప్ లు వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచాయి.సేకరించిన సమాచారాన్ని ఉపయోగించు కుని రుణ గ్రహీతలకు బ్లాక్ మెయిల్ చేయడం, అధిక వడ్డీలను వసూలు చేస్తూ దోపిడీకి దిగాయి. ఈ యాప్ లు ఆగ్నేయాసియా,ఆఫ్రికా, లాటిన్ అమెరికా, లో నివసిస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ESET పరిశోధకులు తెలిపారు. వీటిని వినియోగదారులు తమ ఫోన్ల నుంచి తొలగించాలని గూగుల్ యాజమాన్యం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *