సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ చేంజర్ ‘.. గత మూడేళ్ళు గా షూటింగ్ జరుపుకుం టూనే వస్తుంది. అయితే తాజాగా రాంచరణ్ బర్తడే సందర్భముగా విడుదలయిన సాంగ్ వీడియో క్లిపింగ్స్ అభిమానులను అలరించాయి. దీనిపై ఈ దిల్ రాజు వివరణ ఇస్తూ.. ఈ సాంగ్స్ క్లిపింగ్స్ లో చూసింది 2శాతమే.. ఒక రేంజ్ లో ఉంటుంది.. అంత దాచేసాం అన్నారు. అయితే రామ్ చరణ్ అభిమానులు నన్ను తిట్టుకొంటున్నారని తెలుసు.. RRR తో ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన చరణ్ కేజ్ కి తగ్గట్టు సినిమా వస్తుంది. మరో 5 నెలలలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొనివస్తున్నాము .. సినిమా అద్భుతంగ తయారు అవుతుంది.. అన్నారు. అయితే ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం మే నెలకు సినిమాను పూర్తి చేసి భారీ ప్రమోషన్స్ తదుపరి ఈ ఏడాది దీపావళీ కానుకగా అక్టోబర్ 31న సినిమాను రిలీజ్ కి శంకర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు టాక్.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కు తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నా రు.. ఇక శ్రీకాంత్, సునీల్, అంజలి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..తమన్ సంగీతాన్ని అందిస్తున్నా రు..
