సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి సినిమాగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈనెల 10న భారీ అంచ‌నాల‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టినట్లుగా చెబుతూ.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే రూ.186 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించినట్లుగా (దేశంలో మొదటి రోజు భారీ కలెక్షన్స్ లో 5వ సినిమాగా) మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. అయితే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద వివాదమే నెలకొంది. డిస్ట్రిబ్యూటర్స్ రిపోర్ట్ ప్రకారం బెనిఫిట్ షో కలెక్షన్స్ కలిపినా 70 నుండి 80 కోట్లు కలెక్షన్స్ దాటవని మరో వర్గం ప్రచారం చేస్తుంది. ( నిజానికి 182 కోట్ల గ్రాస్ తో 5వ స్థానంలో దేవర ఉంది,)ఇదిలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’. లో రామ్ చరణ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు ఇందులో 15 కోట్ల ఖర్చు తో నిర్మించిన ‘నా నా హైరానా’ పాట కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడా పాటను నిన్నటి నుండి బోనస్ గా యాడ్ చేసినట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *