సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం సమీపంలోని గొరగనమూడి గ్రామ పంచాయతీ లో రైతుభరోసా కేంద్రాన్ని నేడు, ఆదివారం సాయంత్రం అంధ్ర ప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఉండి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ మరియు DCCB చైర్మన్ PVL నర్సింహ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భముగా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక రైతులనుద్దేశించి మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్ సర్కార్ అందిస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలని, అవినీతికి, మధ్యవర్తులు తావు లేకుండా మీ అకౌంట్ లలోకి ప్రభుత్వ సొమ్మును వేసున్నారని, ఇది దేశానికీ , పలు రాష్ట్రాలకు కూడా ఆదర్శం అయ్యిందని, ఇప్పుడు కొత్తగా ఈ గొరగనమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా భవనం ను రైతులు చక్కగా ఉపయోగించుకొని, తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొనిరావచ్చునని, అలాగే తాము పండించిన పంటకు ప్రభుత్వ గిట్టుబాటు ధరను పొందవచ్చునని హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *