సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలోని గొల్లవాని తిప్ప గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విష్ణు డెంటల్ ఆస్పత్రిని నేడు, బుధవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార దృష్టితో పట్టణంలో కాకుండా గ్రామీణ ప్రజల కోసం డెంటల్ ఆసుపత్రి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణు రాజు ను ఆయన అభినందించారు. ఇక్కడ చాల స్వల్ప ఖర్చుతో ఈ ఆసుపత్రిలో దంతాలకు సంబంధించిన వైద్య సౌకర్యాన్ని పొందవచ్చని అని పేర్కొన్నారు .ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ.. విష్ణు డెంటల్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే 32 ఆసుపత్రులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని. దీనిలో భాగంగా గొల్లవాని తిప్ప గ్రామంలో 33వ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామరాజు, రాఘవ రాజు, వైసిపి పార్టీ నాయకులు, సర్పంచులు ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదానికి గురై ఇంటివద్ద కో లు కుంటున్న పార్టీ నాయకులు బోకూరి విజయరాజును, బండి శక్తిశ్వర సాంబ మూర్తిని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శించారు.
