సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధి లో పేదలకు ఇచ్చిన స్థలాలలో నిర్మిస్తున్న ఇళ్ల సముదాయాలయిన జగనన్న కాలనీలకు ఇండ్ల నిర్మాణంలో కొంత ఆర్ధిక సాయంతో పాటు పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు, కరెంట్, వీధి లైట్స్, డ్రైనేజీ, మంచి నీరు వంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నాం అని ప్రకటించారు. దీనిలో భాగంగా .భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలోని జగనన్న కాలనీలో 130 ఫ్లాట్లకు సంబంధించి రూ 10 లక్షల రూపాయలతో ఏర్పాట్లు చేసిన వీధిలైట్ల సౌకర్యాన్ని ఎలక్ట్రిఫికేషన్ పనులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు అధికారులు, స్థానిక వైసిపి నేతలు పాల్గొన్నారు.
