సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి గోదావరి జిల్లాలో పండగలంటే చేసే హడావిడి మాములుగా ఉండదు. అందులోను సంక్రాంతి కి కొత్త అల్లుళ్ల కు ఇచ్చే మర్యాదలు ఆతిధ్యం మాములుగా ఉండవు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కు అనుకొనిఉన్నకేంద్ర పాలిత ప్రాంతమైన యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల రెండవ కుమార్తె హరిణ్యకు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో ఇటీవల వివాహం అయింది. కొత్తగా పెళ్లయి వచ్చిన చిన్నల్లుడిని సంక్రాంతి పండగకు ఆహ్వానించి ఏకంగా కనివిని ఎరుగని రీతిలో 500 రకాలతో ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు అత్తా, మామలు. వివిధ రకాల శాకాహారంతో మాత్రమే , పిండి వంటలు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు ఇలా 500 వందల రకాలు కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి.. అల్లుడు సాకేత్ కుమార్తె హరిణ్యకు ఇద్దరికి విందు ఏర్పాటు చేశారు. శాఖాహారంలో ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందని అల్లుడు సాకేత్ తెగ ముగ్ధుడు అయ్యిపోయాడు.
