సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడికి చెందిన వెన్నేటి రాజేశ్వరి (35) అనే మహిళా ఆలమూరు (కొత్తపేట) వద్ద నేడు, ఆదివారం జొన్నాడ గౌతమి కొత్త బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పటికే గోదావరినదిలో మునిగిపోతున్న మహిళను స్థానిక మత్యకారుడు సహాయంతో నామపై వెళ్లి ఒక యువకుడు దేవుడిలా వచ్చి సాహసోపేతంగా కాపాడటం జరిగింది. (ఫై ఫొటోలో)విషయం తెలుసుకున్న హెచ్సీ నాయుడు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బైక్ పై రావులపాలెం ఆసుపత్రికి తరలించడం డాక్టర్స్ ఆమెను కాపాడే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది విచారణ జరుపుతున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *