సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి ఆదివారం తెల్లవారుజామునకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు దిత్వా తుపాను చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. . తుఫాను ప్రభావంతో నేటి శనివారం సాయంత్రానికి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. . రాయలసీమ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ప్రక్క గోదావరి జిల్లాలు బాగా చల్లబడిపోయి చలిగాలులు తీవ్రత పెరిగింది. తుఫాను ప్రభావం దృష్ట్యా నేటి నుండి 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని కోరారు. మూడు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ఈనేపథ్యంలో తీవ్రత ఎక్కువ ఉండే రెడ్ అలర్ట్ ను నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ప్రకటించారు. ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *